Header Banner

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం! నడుస్తున్న రైలే రెండు భాగాలుగా.. ఘటనపై రైల్వే విచారణ!

  Tue Apr 08, 2025 11:40        Others

సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ఇవాళ భారీ ప్రమాదం తప్పింది. ఏపీలోని శ్రీకాకుళం సమీపంలోకి రాగానే ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అదీ మొత్తం రైలు సగానికి విడిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం మధ్యలోనే ఇలా విడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది రైలును నిలిపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. సూపర్ ఫాస్ట్ రైలు కావడం, ఇలా మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తిరిగి బోగీల్ని జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు.


ఇది కూడా చదవండి: రైలులో ప్రయాణం చేస్తున్నారా.? బాబోయ్.. ఇకపై ఎంత అంటే అంత లగేజీని తీసుకెళ్తే అంతే సంగతులు!


అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లనుంది. రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి బోగీలు ఎందుకు విడిపోయాయన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేక విద్రోహ చర్య ఉందా అన్నది తేలాల్సి ఉంది. బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తిరిగి బోగీల్ని జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లనుంది. రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి బోగీలు ఎందుకు విడిపోయాయన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేక విద్రోహ చర్య ఉందా అన్నది తేలాల్సి ఉంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FalaknumaExpress #TrainAccidentAverted #IndianRailways #RailwaySafety